Top 10 Hidden Mobile Tips & Tricks In Telugu – మొబైల్ లో మీకు తెలియని 10 Secret Features:
ఈ ఆధునిక కాలంలో మనం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడడం అనేది అలవాటు అయిపోయింది. కాని చాలా మందికి మొబైల్ లో ఉన్న Hidden Features గురించి తెలియదు. అలాంటి వారి కోసం ఈ ఆర్టికల్ మీకు తెలియని Top 10 Hidden Secret Features టిప్స్ & ట్రిక్స్ గురించిస్టెప్ step-by-step తెలుసుకుందాం.!
1. Screen Pinning – ఒక యాప్ ని లాక్ చేయడం ఎలా?
మీ మొబైల్ లో ఉన్న స్క్రీన్ పిన్నింగ్ అనే ఈ ఆప్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది.ఈ ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మీకు కావలిసిన యాప్ ని మాత్రమే ఓపెన్ చేసి use చేసుకోవచ్చు. మీ మొబైల్ ఎవరికి అయిన ఇచ్చినప్పుడు లేదా చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు ఇలాంటి సందర్బంలో బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఆప్షన్ ఎలా use చేయాలి.?
స్టెప్స్ :
- మీ మొబైల్ లో Settings → Security → Screen Pinning ని ఓపెన్ చేయండి. (Note: This option may not be available on some mobiles. you can do next process)
- తర్వాత Recent Apps బటన్ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు రీసెంట్ గా ఓపెన్ చేసిన యాప్స్ కనిపిస్తుంటాయి. మీరు ఏ యాప్ Pin చేయాలనుకుంటున్నారో దానిపై press చేసి Hold చేయండి. లేదా అక్కడ top right side లో ఉన్న 3 డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేసి PIN ఆప్షన్ ని enable చేయండి.
- ఇప్పుడు మీరు కేవలం ఈ యాప్ ని తప్ప మీ మొబైల్ వేరే ఎలాంటి యాప్స్ ని use చేయలేరు.
- మళ్ళీ Unpin చేయాడానికి “back button + Home or (Recent Apps button)” ఒకేసారి క్లిక్ & Hold చేయండి.
1. Developer Options Unlock చేయడం ఎలా?
డెవలపర్ ఆప్షన్స్ లో మనకు ఉపయోగపడే చాలా best features ఉంటాయి. Ex: ఫోన్ స్పీడ్ పెంచాదానికి, background లిమిట్, మరియు mock location change చేయడం. ఇలాంటి చాలా ఫీచర్స్ ఇందులో ఉంటాయి. మరి వీటిని ఎలా వాడాలో తెలుసుకుందాం.!
Note : (ఈ ఆప్షన్ కొన్ని మొబైల్స్ లో Default గా వస్తుంది. ఒకవేలా లేకుంటే ఈ steps ఫాలో అవ్వండి.)
స్టెప్స్ :
- మీ మొబైల్ లో Settings → About Phone → Build Number ఆప్షన్ ఫై 7 Times క్లిక్ చేయండి.
- ఇప్పుడు మళ్ళీ back వచ్చి setting లో చుడండి. “Developer Option” కనిపిస్తుంది.
- ఈ ఆప్షన్ ఫై క్లిక్ చేసి మీకు కావలిసిన ఆప్షన్ ని enable / disable చేసుకోవచ్చు .
3. Guest Mode Use చేయడం ఎలా?
ఈ Guest Mode ఆప్షన్ ముఖ్యంగా మీరు మీ మొబైల్ ని ఫ్రెండ్స్ లేదా వేరే వారికి ఇచ్చినప్పుడు మీ పర్సనల్ డేటా వారికి కనిపించకుండా చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా వాడాలో తెలుసుకుందాం.!
Note: ఈ ఆప్షన్ కొన్ని మొబైల్స్ లో “Multiple User” or “Add User” or “Private Mode” or “Secure Folder” or “Guest Profile” And “Second Space” అని ఉండొచ్చు. ఇది మొబైల్ కంపెనీ మీద ఆదారపడి ఉంటుంది.
స్టెప్స్ :
- మీ మొబైల్ లో Swipe down → Tap on User icon. లేదా setting లో పైన ఇచ్చిన Name తో సెర్చ్ చేయండి.
- ఆప్షన్ ని క్లిక్ చేసి ఆక్టివేట్ చేసుకోండి.
- ఇప్పుడు మీ మొబైల్ మీ డేటా అంతా hide అవుతుంది. (డిలీట్ అవ్వదు.) మీరు కొత్త మొబైల్ తిడుకుంటే ఉండే interface ఉంటుంది. మళ్ళీ password ఇచ్చి main mode కి చేంజ్ అవ్వండి.
4. App Lock చేయడం ఎలా? Without Any App
ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ install చేయకుండా, మీ మొబైల్ లో యాప్స్ కి లాక్ పెట్టడం ఎలా? (Note: ఈ ఆప్షన్ MI/ Realme/ Oppo/ Samsung lo ఉంటుంది.) మీ మొబైల్ ఒక్కసారి చెక్ చేసుకోండి.
స్టెప్స్ :
- మొబైల్ లో Settings → Privacy → App Lock క్లిక్ చేయండి.
- మీకు గుర్తు ఉండే password ని ఇవ్వండి.
- ఇప్పుడు మీ మొబైల్ లో ఉండే అన్ని యాప్స్ కనిపిస్తాయి. మీకు కావలిసిన యాప్ కి లాక్ set చేయండి.
- లాక్ remove చేయాలంటే మళ్ళీ Settings → Privacy → App Lock వెళ్లి ఆఫ్ చేయండి.
5. One-Hand Mode Enable చేయడం ఎలా?
ఒక్కోసారి మనం డ్రైవింగ్ లో కాని, లేదా ఒక్క చేతితో మొబైల్ వాడవలసి వస్తుంది. అలాంటి సమయం లో ఈ ఆప్షన్ చాలా use అవుతుంది.
స్టెప్స్ :
- Settings → Additional Settings → One-handed mode ఆప్షన్ కి వెళ్ళండి.
- Swipe from Home button → Screen shrink అవుతుంది.
- keyboard ని మీకు కావలిసిన side set చేసుకొని వాడండి.
6. డిలీట్ అయిన Notification History ని చూడడం ఎలా?
ఒక్కోసారి మనం పొరపాటున మొబైల్ లో ఉన్న messages డిలీట్ చేస్తుంటాం. మళ్ళీ మనం అవి తిరిగి పొందడానికి ఈ ఆప్షన్ use అవుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం.!
స్టెప్స్ :
- మీ మొబైల్ లో setting లో notification హిస్టరీ అని సెర్చ్ చేయండి (or)
- Long Press on Home Screen → Widgets → Settings Shortcut.
- Select “Notification Log”.
- Widget ని home screen లో పెట్టి, క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీ డిలీట్ అయిన messages చూడవచ్చు.
7. Battery Usage Accurate గా తెలుసుకోవడం ఎలా?
మన మొబైల్ కొన్నిసార్లు ఛార్జింగ్ చాలా fast గా దిగిపోతుంది. ఇలా జరగడానికి కారణం మనం use చెయ్యని కొన్ని యాప్స్ background లో run అవ్వడం వల్ల జరుగుతుంది. మన మొబైల్ లో ఛార్జింగ్ త్వరగా అవ్వకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్స్ :
- Settings → Battery → Battery Usage ఆప్షన్ కి వెళ్ళండి.
- ఇక్కడ మీకు మీ మొబైల్ లో ఉండే యాప్స్ అన్ని కనిపిస్తాయి . ఏ యాప్ ఎంత పవర్ consume చేస్తుందో ఇక్కడ కనిపిస్తుంది.
- మీరు use చెయ్యని యాప్స్ & ఎక్కువ పవర్ ని consume చేసే వాటిని uninstall or disable (restrict) చెయ్యండి.
8. LIve & Quick Translate Using Google Len:
మీలో చాలా మందికి తెలియని మొబైల్ hidden secret ఇది ఒకటి. ఈ ఆప్షన్ మనకు చాలా బాగా use అవుతుంది. ఇది ఏ భాషలో ఉన్న పదాలు అయిన సరే మనకి కావలిసిన భాషలో లైవ్ మారుస్తుంది. మీరు కుడా ఈ ఫీచర్ ని try చేయండి. దీన్ని ఎలా use చేయాలో తెలుసుకుందాం.!
స్టెప్స్ :
- ముందుగా మీ మొబైల్ లో ఉన్న గూగుల్ యాప్ ని ఓపెన్ చెయ్యండి.
- translate ఐకాన్ ఫై క్లిక్ చేసి, primary Language మరియు Secondary language (Ex: ఇంగ్లీష్ to తెలుగు) సెలెక్ట్ చేసుకోండి.
- మీకు కనిపిస్తున్న కెమెరా తో స్కాన్ చెయ్యండి. మీకు లైవ్ లో text చేంజ్ అయ్యి కనిపిస్తుంది.
9. Split Screen Multi-tasking:
ఈ ఆప్షన్ మనకు multiple screen ఒకే screen ఫై చూపిస్తుంది. ఇది ముఖ్యంగా మనం ఏదైనా ఆర్టికల్ or text ని గూగుల్ or వేరే websites నుండి text notepad టైపు చేసేటప్పుడు మళ్ళీ, మళ్ళీ ఓపెన్ చేస్తూ టైపు చేయవలిసి ఉంటుంది. ఇలాంటి సమయం లో ఈ ఆప్షన్ use చేయవచ్చు. ఎలా చేయాలి?
స్టెప్స్ :
- ముందుగా మీకు కావలిసిన tabs (EX: Google & Notepad) ఓపెన్ చేసుకొని Home కి రావాలి.
- తర్వాత మీ మొబైల్ లో Recent Apps button ఓపెన్ చేసి మీకు కావలిసిన screen ఫై press & Hold చెయ్యండి.
- మీకు కనిపిస్తున్న Split screen అనే ఆప్షన్ ఫై క్లిక్ చెయ్యండి. (Note: ఈ ఆప్షన్ మొబైల్స్ మోడల్ ఆదారంగా ఉంటుంది.)
- first screen సెలెక్ట్ చేసిన తర్వాత second screen సెలెక్ట్ చేసుకొని, రెండు screens ని ఒకేసారి use చేసుకోవచ్చు.
10. App Cloner – ఒకే App కి రెండు Accounts వాడండి!
మీ మొబైల్ లో ఉన్న ప్రతి యాప్ ని డబుల్ చేయాలంటే ఈ ఆప్షన్ ఉపయోఅగాపడుతుంది. WhatsApp / Instagram accounts వాడాలంటే ఇది చాలా బాగుంటుంది. ఈ ఆప్షన్ enable చేయడానికి..
స్టెప్స్ :
- మీ మొబైల్ లో setting ఓపెన్ చేసి dual apps ( App Cloner) సెర్చ్ చేసి enable చేయండి. ఇప్పుడు మీ యాప్ క్లోన్ చేసి use చేసుకోవచ్చు.
- ఈ ఆప్షన్ కొన్ని మొబైల్ లో డిఫాల్ట్ గా వస్తుంది. ఒకవేలా ఈ ఆప్షన్ మీ మొబైల్ లో లేకుంటే మీరు Play store నుండి Parallel space App (or) Clone App and dual Cloner లాంటి థర్డ్ పార్టీ యాప్స్ use చేసి మీకు కావలిసిన యాప్స్ ని dual గా చేయండి.
🧠 Conclusion: మీ ఫోన్లో మీరు మిస్సవుతున్న options ఇవే!
మన రోజూ వాడే మొబైల్లోనే ఎంతో powerful, కానీ చాలామందికి తెలియని hidden features ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా? ఈ వ్యాసంలో మీరు తెలుసుకున్న టిప్స్‌తో మీ ఫోన్ యూజ్ను మరింత productivity, safety, మరియు smart experience గా మార్చుకోవచ్చు.
ఇప్పటి నుంచే ఈ tricks ని మీ మొబైల్లో apply చేసి చూడండి.!
❓ FAQs – Mobile Hidden Features గురించి మీకు ఉండే Most Common Questions:
🔸 1. Screen pinning ఎంత secure ఉంటుంది?
ఇది basic level screen lock security. Full security కోసం fingerprint/face lock తో కలిపి వాడితే బెటర్.
🔸 2. Developer options enable చేయడం వల్ల ఏమైనా danger ఉందా?
కాదు, కానీ మీరు తెలియకుండా కొన్ని settings change చేస్తే performance ప్రభావితం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా వాడాలి.
🔸 3. Dual apps option అన్ని ఫోన్లలో ఉందా?
లేదు. Xiaomi, Samsung, Realme, Vivo, Oppo లాంటి కొన్ని ఫోన్లలో మాత్రమే ఉంటుంది. లేదంటే third-party apps వాడాలి.
🔸 4. Google Lens Telugu నుండి English కి live translate చేస్తుందా?
అవును! ఇప్పుడు Google Lens దాదాపు అన్ని Indian languages కూడా support చేస్తోంది.
🔸 5. Quick launch gestures అన్ని brand లలో work అవుతాయా?
బ్రాండ్ పై ఆధారపడి ఉంటుంది. కొన్ని ఫోన్లలో gestures customization options ఉంటాయి.
మీకు ఈ టిప్స్ చాలా useful అనిపించాయంటే, ఈ article ని మీ friends తో share చేయండి 👉
మీరు ఏ mobile tricks మీరు daily use చేస్తారు? Comment లో తప్పకుండా mention చేయండి!
ఇంకా ఇలాంటివి రోజూ తెలుసుకోవాలంటే – మా టెక్ బ్లాగ్‌ను bookmark చేయండి ✅
ఇవి కూడా చుడండి ⇒ మీ మొబైల్ మరియు కంప్యూటర్ లోని డిలీట్ అయిన ఫొటోస్ ని తిరిగి పొందడం ఎలా?









