How to Recover Deleted Photos on Android & PC – మీ మొబైల్ మరియు కంప్యూటర్ లోని డిలీట్ అయిన ఫొటోస్ ని తిరిగి పొందడం ఎలా?
డిలీట్ అయిన ఫోటోలు తిరిగి పొందడం చాలా మందికి అవసరమైన విషయం. ఈ article లో మేము Deleted Photos Recovery గురించి పూర్తిగా వివరంగా తెలుగులో చర్చించబోతున్నాం. ఇప్పుడున్న ప్రపంచం లో అందరు ఫోన్ వాడడం అనేది తప్పనిసరి అయ్యింది. అయితే మనలో చాలా మంది ఎప్పుడో ఒకసారి మన ఫోన్ ని వేరే వాళ్లకి ఇచ్చిన్నప్పుడు కాని, లేదా మనమే అనుకోకుండా మన మొబైల్ లో ఫోటోస్ డిలీట్ అవుతుంటాయి. అందులో మనకి కావలిసిన ముఖ్యమైన డేటా ఉంటుంది. కొందరు డేటా recovery కోసం సర్వీస్ సెంటర్స్ కు వెళ్లి డేటా తిరిగి పొందుతారు. వాళ్ళు దానికి కొంత అమౌంట్ తీసుకుంటారు. కాని మనం డేటా recovery కోసం ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మనమే ఫ్రీ గా చేసుకోవచ్చు. కేవలం మొబైల్ లో మాత్రమె కాదు మీ కంప్యూటర్ లో కూడా డిలీట్ అయిన డేటా ని తిరిగి ఎలా పొందాలో మనం ఈ ఇప్పుడు తెలుసుకుందాం. ఫోటోలు తిరిగి పొందే విధానం గురించి Deleted Photos Recovery guide ఇది.
📱 మొబైల్ లో Deleted Photos Recovery చేయడం ఎలా? (Without pc)
1. గూగుల్ ఫొటోస్ లో Trash నుండి Restore చేయడం
మనం వాడుతున్న ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ లో గూగుల్ ఫొటోస్ అనే యాప్ ఉంటుంది. ఇందులో నుండి డేటా recovery ఎలా చేయాలో చూద్దాం!
స్టెప్స్:
- ముందుగా మీ మొబైల్ లో గూగుల్ ఫొటోస్ యాప్ ఓపెన్ చెయ్యండి.
- 2. క్రింద కనిపిస్తున్న Library లేదా (Collections) > Bin (Trash) ఓపెన్ చెయ్యండి.
- 3. తర్వాత మీరు డిలీట్ చేసిన ఫొటోస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీకు కావలిసిన ఫొటో ఫై క్లిక్ చేయగానే, Restore అనే ఆప్షన్ ఫై క్లిక్ చేయండి. లేదా మీకు ఇందులో ఉన్న అన్ని ఫొటోస్ కావాలనుకుంటే ఫోటో ఫై క్లిక్ చేసి హోల్డ్ చేయండి తర్వాత మీకు సెలెక్ట్ ఆప్షన్ వస్తుంది. All సెలెక్ట్ చేసి Restore చేసుకోండి. తర్వాత మీ మొబైల్ గేలరీ లో డౌన్లోడ్ అవుతాయి.
- ఫోటోలు తిరిగి పొందే విధానం గురించి Deleted Photos Recovery guide ఇది.
ఇక్కడ కనిపిస్తున్న ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.

- Note: ఈ ప్రాసెస్ కేవలం ఇంతక ముందు గూగుల్ ఫొటోస్ కి సింక్ అయిన ఫొటోస్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరు. మరియు మీరు మీ ఫొటోస్ గేలరీ లో డిలీట్ చేసిన రోజు నుండి కేవలం 30 రోజులు వరకు మాత్రమే తిరిగి Restore చేసుకోగలరు.
DOWNLOAD LINK: Click Here
How to Sync Google Photos to Gmail? – గూగుల్ ఫొటోస్ ని Gmail కి ఎలా సింక్ చేయాలి?
- ముందుగా మీ మొబైల్ లో గూగుల్ ఫొటోస్ యాప్ లో మీ Gmail తో login అవ్వండి.
- తర్వాత యాప్ లో పైన Right Side లో మీ కనిపిస్తున్న ఐకాన్ ఫై క్లిక్ చేయండి. ఫోటో సెట్టింగ్స్ ఆప్షన్ ఫై క్లిక్ చేసి, Backup ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒకవేళ మీ మొబైల్ పోయిన కుడా మీరు మళ్ళి మీరు Gmail తో వేరే మొబైల్ లేదా computer లో login అయ్యి మీ ఫొటోస్ ని తిరిగి పొందవచ్చు.
- ఫోటోలు తిరిగి పొందే విధానం గురించి Deleted Photos Recovery guide ఇది.
2. DiskDigger Photo Recovery App: (No Root Required)
డిలీట్ అయిన ఫొటోస్ ని recovery చేయడానికి ఆండ్రాయిడ్ మొబైల్ కోసం DiskDigger యాప్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ యాప్ ముఖ్యంగా ఫొటోస్ డిలీట్ అయిన తర్వాత కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసి మన ఫొటోస్ ని తిరిగి restore చేస్తుంది. దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం.
- ముందుగా మొబైల్ లో Play store యాప్ ని ఓపెన్ చేసి, DiskDigger యాప్ ని డౌన్లోడ్ చేయండి.
- తర్వాత యాప్ ఓపెన్ చేసి “Start Basic Photo Scan” ఆప్షన్ ని క్లిక్ చేయండి. డిలీట్ అయిన ఫొటోస్ ని స్కాన్ చేసి ప్రివ్యూ చూపిస్తుంది.
- మీకు కావలిసిన ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకొని Recovery ఆప్షన్ ఫై క్లిక్ చేయండి. మీ గేలరీ లో డౌన్లోడ్ అవుతాయి.
మీ మొబైల్ Rooted అయితే Deep Scan కుడా అవుతుంది. ( NOTE: This Option Not Working Non-Root Mobiles)
3. Dumpster App:
Dumpster App కూడా ఫొటోస్ మరియు వీడియోస్ ని recovery చేయడం లో ఆండ్రాయిడ్ లో ఉన్న recycle bin లాగా పనిచేస్తుంది. అంటే ఇది కేవలం గూగుల్ ఫొటోస్ యాప్ లాగా, ఫొటోస్ డిలీట్ అవ్వకముందు యాప్ డౌన్లోడ్ అయ్యి ఉంటే మాత్రమె backup అవుతుంది. దీన్ని మీ మొబైల్ లో ముందే డౌన్లోడ్ చేసుకోవడం వల్ల తర్వాత recovery చేయడం చాల ఈజీ అవుతుంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
- Play Store నుండి యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఇందులో Free మరియు Paid version ఉన్నాయి. ఫ్రీ లో లిమిటెడ్ Acess ఉంటుంది.
- Deep Scan ఆప్షన్ ఫై క్లిక్ చేసి మీకు కావలిసిన ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- ఫోటోలు తిరిగి పొందే విధానం గురించి Deleted Photos Recovery guide ఇది.
DOWNLOAD LINK: Click Here
🖥️ కంప్యూటర్ లో Deleted Photos రికవరీ కోసం Software tools:
How to Recover Deleted Photos on Android & PC లో 3 పద్దతులు:
1. Recycle Bin నుండి Restore చేయడం:
- మీ computer లో ఉన్న Recycle bin ఐకాన్ ఫై double క్లిక్ చెయ్యండి.
- తర్వాత మీరు డిలీట్ చేసిన ఫొటోస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మీకు కావలిసిన ఫొటోస్ ఫై double క్లిక్ లేదా right క్లిక్ చేసి, Restore చేయండి. అవి ఇంతకు ముందు ఉన్న లొకేషన్ లో సేవ్ అవుతాయి.
2. Free Software: Recuva (By CCleaner):
- ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి Recuva వెబ్ సైట్ కి వెళ్ళి Free Software ని install చెయ్యండి.
- Link: ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఫైల్ టైపు లో “Pictures” సెలెక్ట్ చెయ్యండి.
- మీ computer లో నుండి డిలీట్ అయిన లొకేషన్ Path ఇవ్వండి. (Ex: D:, Desktop etc.).
- Scan కంప్లీట్ అయిన తర్వాత మీకు కావలిసిన ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ Deleted Photos Recovery టూల్ వినియోగించండి
 
    
3. Windows File History – (If Enabled Earlier:
- NOTE: ఫైల్ హిస్టరీ Enabled ఉంటేనే, పాత (Old) డేటా Restore చేయవచ్చు.
Steps:
- ఫోటో ఉందే ఫోల్డర్ ఓపెన్ చెయ్యండి.
- పైన కనిపిస్తున్న “History” option ని క్లిక్ చెయ్యండి.
- డిలీట్ ఫైల్స్ ప్రివ్యూ కనిపిస్తుంది. సెలెక్ట్ చేసి restore చెయ్యండి.
ఫోటోలు తిరిగి పొందే విధానం గురించి Deleted Photos Recovery guide ఇది.
Conclusion:
- Mobile lo: Google Photos, DiskDigger, Dumpster use చేయవచ్చు.
- PC lo: Recycle Bin, Recuva, or File History డిలీట్ ఫొటోస్ recovery కి ఉపయోగపడతాయి.
| Tool Name | Install Before? | Install After Delete? | Notes | 
|---|---|---|---|
| Google Photos | Yes (Auto backup ON) | No | Backup essential | 
| DiskDigger | Not needed | Yes | Better if root access available | 
| Dumpster | Yes | No | Preventive only | 
| Recuva (PC) | Not needed | Yes | Avoid installing in C:\ after delete | 
🧠 FAQ Section❓– Telugu:
1. మొబైల్ లో డిలీట్ అయిన ఫోటోలు తిరిగి పొందవచ్చా?
✔️ సమాధానం: అవును, మీరు Google Photos, DiskDigger, లేదా Dumpster వంటి యాప్స్ ఉపయోగించి డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందవచ్చు.
2. Google Photos లో డిలీట్ అయిన ఫోటోలు శాశ్వతంగా పోతాయా?
✔️ సమాధానం: లేదు, Google Photos లో “Trash” (Bin) లో 30 రోజులు వరకు ఫోటోలు ఉంటాయి. ఆ తర్వాతే అవి శాశ్వతంగా డిలీట్ అవుతాయి.
3. computer లో డిలీట్ అయిన ఫోటోలు తిరిగి పొందడానికి best సాఫ్ట్‌వేర్ ఏది?
✔️ సమాధానం: Recuva అనే ఉచిత సాఫ్ట్‌వేర్ Windows పీసీ లో డిలీట్ అయిన ఫైల్స్, ఫోటోలను తిరిగి పొందటానికి అత్యుత్తమమైనది.
4. Root లేకుండానే Android లో ఫోటోలు రికవరీ చేయవచ్చా?
✔️ సమాధానం: అవును కొంతవరకు చేయవచ్చు . DiskDigger Lite వంటి యాప్స్ root లేకుండా కూడా పని చేస్తాయి, కానీ పూర్తిగా రికవరీ చేయాలంటే root అవసరం ఉంటుంది.
5. శాశ్వతంగా డిలీట్ అయిన ఫోటోలు తిరిగి రికవర్ అవుతాయా?
✔️ సమాధానం: అవి మళ్ళీ ఏదైనా కొత్త డేటా తో overwrite కాకపోతే, కొన్ని సందర్భాల్లో రికవర్ చేయవచ్చు . కానీ ఇది 100% పని చేస్తుంది అనే గ్యారంటి లేదు.
6. Dumpster యాప్ ఎలా పనిచేస్తుంది?
✔️ సమాధానం: Dumpster అనేది Android కోసం Recycle Bin లా పని చేస్తుంది. మీరు డిలీట్ చేసిన ఫైల్స్‌ను తాత్కాలికంగా సేవ్ చేస్తుంది, మీరు వాటిని తిరిగి రికవర్ చేసుకోవచ్చు.
7. Recuva సాఫ్ట్‌వేర్ సేఫ్ అనీ నమ్మకమైనదేనా?
✔️ సమాధానం: అవును, ఇది Piriform అనే ప్రసిద్ధ సంస్థ రూపొందించింది. అదే సంస్థ CCleaner ను కూడా రూపొందించింది. కాబట్టి ఇది సేఫ్ & ట్రస్ట్ చేయదగినది.
8. రికవరీ చేసిన ఫోటోల క్వాలిటీ తగ్గిపోతుందా?
✔️ సమాధానం: కొన్ని సందర్భాల్లో అవి పూర్తిగా రికవర్ కాకపోవచ్చు లేదా క్వాలిటీ తగ్గవచ్చు. ఇది యాప్ పనితీరు & ఫైల్ డామేజ్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది.
9. ఫోటో రికవరీ యాప్స్ ఉపయోగించడం లీగల్ అనుకుంటారా?
✔️ సమాధానం: మీరు మీ స్వంత ఫోటోలకే రికవరీ చేస్తే అది పూర్తిగా లీగల్. కానీ ఇతరుల ఫోన్ నుంచి రికవరీ చేయడం లీగల్ కాదు. వారి పర్మిషన్ తో recovery చేయడం లీగల్.
10. ఉచితంగా ఉపయోగించదగిన ఉత్తమ యాప్స్ & టూల్స్ ఏవి?
✔️ సమాధానం:
- మొబైల్: Google Photos, DiskDigger Lite, Dumpster 
- PC: Recuva Free Version. 
- ఫోటోలు తిరిగి పొందే విధానం గురించి Deleted Photos Recovery guide ఇది.
ఇవి కుడా చుడండి ⇒ మొబైల్ లో మీకు తెలియని 10 Secret Tricks

 
 








