Dark Web Vs Deep Web Explained in Telugu – డార్క్ వెబ్ మరియు డీప్ వెబ్ మధ్య తేడాలు?

Table of Contents

Dark Web Vs Deep Web Explained in Telugu – డార్క్ వెబ్ మరియు డీప్ వెబ్ మధ్య తేడాలు?

డీప్ వెబ్ అంటే ఏంటి? డార్క్ వెబ్‌లో ఎలాంటి అక్రమాలు  జరుగుతుంటాయి? వాటి మధ్య తేడా ఏమిటి? డార్క్ వెబ్ ని ఎలా access చేస్తారు? అనే వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

మనం రోజూ వాడే Google, YouTube, Facebook లాంటివి Surface Web లోకే చెందినవి. కానీ, ఇది మొత్తం ఇంటర్నెట్‌లో కేవలం 5% మాత్రమే ఉంటుంది! మిగిలినది Deep Web మరియు Dark Web లో ఉంటుంది.డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్ లో ఒక రహస్య భాగం. ఇది సాధారణ సెర్చ్ ఇంజన్ల లో ఇండెక్స్ చేయబడదు. మనమూ రోజూ వాడే Google, YouTube, Facebook లాంటివి Surface Web కిందికే వస్తాయి . కానీ, ఇది మొత్తం ఇంటర్నెట్‌లో కేవలం 5% మాత్రమే ఉంటుంది.! మిగిలినది Deep Web మరియు Dark Web లో ఉంటుంది. మీరు ఇక్కడ వీటి మధ్య కొన్ని తేడాలు గమనించవచ్చు.

Surface Web, Deep Web, Dark Web – తేడాలు

వెబ్ లేయర్వివరణAccess చేయగలగడంఉదాహరణలు
Surface Webమనం రోజూ Google ద్వారా search చేసే సాధారణ వెబ్Open to allWikipedia, YouTube
Deep WebPassword-protected, private డేటాRestricted accessGmail Inbox, Bank Accounts
Dark WebEncrypted network లో ఉంటుంది, అనామకంగాSpecial tools ద్వారా మాత్రమేBlack Markets, Anonymous Forums

Surface Web లేదా Open Web అంటే ఏమిటి?

Ex: మనం ఈ మూడింటిని ఒక సముద్రం లో ఉన్న కొండను ఆదారంగా తీసుకోని మాట్లాడుకుందాం. ఓపెన్ వెబ్ లేదా surface అనేది సముద్రంలో ఉన్న కొండ ఫై ఉన్న ఒక చిన్న ఫై భాగం లాంటిది. ఇది ఇంటర్నెట్ లో ఉన్న అన్ని వెబ్ సైట్, డేటా మొత్తం కలిపి కేవలం 5% మాత్రమే. ఇందులో ఇండెక్స్ అయ్యి ఉన్న అన్ని వెబ్ సైట్ లను Google Chrome, Internet Explorer మరియు Firefox వంటి సెర్చ్ ఇంజన్ లలో access చెయ్యవచ్చు. ఇది ఓపెన్ source platform. ఇందులో ఉన్న అన్ని వెబ్ సైట్ లు “.com” “.in”  లేదా “.Org”  లాంటి కొన్ని  Extension తో ఉంటాయి. వీటిని use చేయడం complete గా లీగల్.

Deep Web అంటే ఏమిటి?

ఈ Deep వెబ్ అనేది సముద్రంలో ఉన్న కొండ యొక్క అడుగు భాగం అని చెప్పవచ్చు. ఇది చాలా పెద్దది surface వెబ్ లో ఉన్న మొత్తం డేటా 5% అయతే మిగతా 95% వెబ్ websites డేటా ఇందులో ఉంటుంది. ఇందులో మొత్తం ఎన్ని web pages active గా ఉన్నాయో కూడా తెలుసుకోలేము. deep web లో ఉన్న web sites ని మనం ప్రతి రోజు చూస్తాం. కాని access చేయలేము. వీటిని government, మరియు కొన్ని పెద్ద, పెద్ద నమ్మకమైన companies నడుపుతాయి. ఇందులో ఉన్న డేటా కొంతవరకు సేఫ్ గా ఉంటుంది. “మీరు ఇప్పుడు చదువుతున్నది ఈ ఆర్టికల్ కూడా deep web” లోనే అని గమనించగలరు. Ex: క్రింద ఇచ్చిన ఈ వెబ్ సైట్స్ కూడా deep web లోని భాగమే.

  • Gmail లో inbox
  • Bank account statements
  • Subscription-based we
  • Financial Accounts and internet banking.
  • Social messages Account (Google, YouTube, Wikipedia, WhatsApp, Facebook, Instagram..etc)

Note: ( ఇవి కూడా మన డేటా ని తీసుకుంటాయి కాని కొంత వరకు సేఫ్ అని గమనించగలరు.)

Dark Web అంటే ఏమిటి?

(⚠️ Note: only education Purpose Don’t Try It)

Dark Web Vs Deep Web Explained in Telugu

Dark Web అనేది deep web లో ఒక చిన్న భాగం అని చెప్పవచ్చు. ఇందులో ఉన్న web sites మనకు కనిపించవు. దీన్ని మనం గూగుల్, Fire Fox లేదా Opera లాంటి సెర్చ్ ఇంజన్ browsers తో access చేయాలేము. ఇది కేవలం special browsers అయిన “The Onion Router”  (TOR) Browser ద్వారా మాత్రమే access చేయగలుగుతారు. ఈ tor browser అనేది మన identity ని hide చేసి ఫేక్ IP తో కనెక్ట్ అవుతుంది. ఇందులో ఇండెక్స్ అయిన ప్రతి వెబ్ సైట్ డొమైన్ కుడా “.Onion” అనే extension ఉంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ డార్క్ వెబ్  సముద్రం లో ఉన్నకొండ యొక్క అడుగు భాగం లాంటిది. దీని లోతు కనుక్కోవడం అసాద్యమే అని చెప్పవచ్చు. డార్క్ వెబ్ గురించి అవగాహన లేకుండా ఓపెన్ చెయ్యకూడదు. “ఇది పూర్తిగా ఇల్లీగల్” ఒకవేలా మీరు ఉస్తహంతో access చేయాలనుకుంటే మీ మొబైల్ “HACK” అయ్యి, మీ డేటా అంత hackers చేతిలోకి వెళ్ళుతుంది. అలాగే మీ అడ్రస్ ని పోలీసులు ట్రాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అవగాహన లేకుండా  దీన్ని use చేయకపోవడం మంచిది. అయితే ఇందులో ఎలాంటి కార్యకాపాలు జరుగుతాయో తెలుసుకుందాం.!

💀 Dark Web లో జరిగే ముఖ్యమైన (అక్రమమైన) కార్యకలాపాలు:

Dark Web Vs Deep Web Explained in Telugu
  • 🔫  illegal arms/ drugs/ Guns sales
  • 💳 Stolen credit card data
  • 🧬 Fake identity documents
  • 🛒 Hacking services
  • 👥 Human trafficking
  • 🧠 Hiring hitmen (fictional or real)
  • 👻 Anonymous communication for whistleblowers.

Dark Web ఎలా Access చేస్తారు?

⚠️ Disclaimer: This is for educational purpose only.

  1. TOR Browser ని install చేయాలి (https://www.torproject.org/)
  2. TOR browser ద్వారా .onion domains ను access చేయొచ్చు
  3. Example:
    http://xyz123abc.onion – ఇది Google లాంటి search engines కి కనిపించదు.

🔐 TOR అంటే ఏమిటి?

Dark Web Vs Deep Web Explained in Telugu

TOR అంటే The Onion Router. ఇది anonymous browsing కోసం ఉపయోగపడే network.

👉 TOR లో మీ identity మరియు location hide అవుతుంది.
👉 ఇక్కడ traffic multiple layers లో encrypt అవుతుంది (అందుకే Onion అన్న పేరు)


⚠️ Dark Web కి వెళ్లడం ఎంత ప్రమాదకరం?

ఏలాంటి Risk ఉంటుంది :
  • ✅ Virus / Malware attack chances ఎక్కువ

  • ❌ Illegal content unknowingly access అయ్యే అవకాశం

    Most Dangerous Android Spy Apps 2025 -జాగ్రత్త మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా?
  • 🧑‍💻 Law enforcement surveillance possibility

  • 💣 Privacy loss & mental disturbance risk

FAQs – Dark Web & Deep Web గురించి మీరు అడిగే ముఖ్యమైన ప్రశ్నలు

Dark Web Vs Deep Web Explained in Telugu

🔸 1. డీప్ వెబ్‌ను ఉపయోగించడం లీగల్‌నా?

అవును! ఇది ప్రతి రోజు మనం వాడే Gmail, Bank వంటి secured services లో భాగం.

🔸 2. డార్క్ వెబ్ నందు access చేయడం నేరమా?

వాడే content పై ఆధారపడి ఉంటుంది. కొంత content పూర్తిగా అక్రమమైనదిగా చట్టరీత్యా నిషిద్ధం.

👉 TOR browser వాడటం తప్పుకాదు. కానీ అక్కడ illegal activities చేయడం తప్పు.

🔸 3. TOR browser వాడటం సురక్షితమా?

Anonymous browsing కోసం TOR ఉపయోగించవచ్చు. కానీ third-party sites లేదా downloads చాలా ప్రమాదకరం కావొచ్చు.

🔸 4. డార్క్ వెబ్‌లో నిజంగా హిట్మన్‌లు ఉంటారా?

WiFi Hacking Real Fake
WiFi Hacking Real / Fake? – మొబైల్ తో నిజంగా wi-fi ని హ్యాక్ చేయవచ్చా?

కొన్నిసార్లు అవి fake listings కావచ్చు, కానీ చాలా activity కు proof ఉండదు. అప్రమత్తంగా ఉండాలి.

🔸5. Mana డీటెయిల్స్ ఎలా Dark Web కి వెళ్ళుతుంది?
👉 Phishing, Fake apps, Weak passwords, Public Wi-Fi వాడటం వలన.


  1. 🧾 ఈ Article లో నేర్చుకున్న ముఖ్యాంశాలు:

  • 🌐 వెబ్‌కి మూడు లేయర్లు: Surface, Deep, Dark

  • 🔐 Deep Web అనేది secure & personal web

  • 🕳️ Dark Web అనేది anonymity తో కూడిన, ప్రమాదకరమైన వెబ్ భాగం

  • 🚨 Dark Web ను access చేయడం ద్వారా రిస్క్ & cyber traps కు గురయ్యే అవకాశం ఉంది.

ఇవి కుడా చుడండి ⇒ మీ మొబైల్ మరియు కంప్యూటర్ లోని డిలీట్ అయిన ఫొటోస్ ని తిరిగి పొందడం ఎలా?


Dark Web Vs Deep Web Explained in Telugu
  1. ఈ article మీకు నచ్చిందా?
    👉 మీ friends కి forward చేయండి – వాళ్ళు కూడా ఈ dangerous zone గురించి తెలుసుకోవాలి!
    📌 మన టెక్ బ్లాగ్‌ను bookmark చేయండి – ఇలాంటివే మరిన్ని shocking articles రోజు మీకోసం!
  2. Comment లో చెప్పండి: మీరు ఇదివరకు Dark Web గురించి ఏదైనా వినారా? TOR browser try చేశారా?

Leave a Comment

NR Telugu Tech

Typically replies within a day