4 Super Useful Tips for Everyday Life – మీకు రోజు ఉపయోగపడే 5 టిప్స్

4 Super Useful Tips for Everyday Life – మీ కోసం రోజు ఉపయోగపడే 5 టిప్స్.!

ఈ ఆర్టికల్ లో మనకు ఖచ్చితంగా రోజు ఏదో ఒక సందర్బం లో ఉపయోగపడే 4 టిప్స్ గురించి తెలుసుకుందాం.! మీరు ఈ ఆర్టికల్ లో ఏఏ విషయాలు గురించి తెలుసుకుంటారు.

  • మనం ఎవరికైన కాల్ చేస్తుంటే ముందుగా “జాగ్రత్తా తెలియని నంబర్స్ నుండి ఆడియో / వీడియో కాల్స్ మేము పోలీస్ / కస్టమ్ / సిబిఐ చెప్పితే భయపడకండి వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు.” అనే ఈ కాలర్ ట్యూన్ ని స్కిప్ చేయడం ఎలా?
  • గూగుల్ పే Transaction హిస్టరీ ని డిలీట్ చేయడం ఎలా?
  • మీ మొబైల్ నుండి ఆధార్ కార్డు డౌన్లోడ్ ఎలా చేయాలి?
  • మొబైల్ నుండి మీ vehicle యొక్క రోడ్ టాక్స్ ఎలా పే చేయాలి? (TS & AP)

1. “జాగ్రత్త” అనే ఈ కాలర్ ట్యూన్ రావడానికి కారణం? 

ఇప్పుడున్న ఆధునిక కాలంలో టెక్నాలజీ అనేది రోజు, రోజుకి కొత్త విధానాలతో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ టెక్నాలజీ వల్ల మనం నిత్య జీవితంలో చేసే పనులను చాలా వేగంగా మరియు తొందరగా చేస్తూ మన సమయాన్ని కూడా తగ్గించుకోవడంలో ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అయితే ప్రతి విషయానికి మంచి, చెడు అని రెండు కోణాలు ఉన్నట్టే, ఈ టెక్నాలజీ విషయం లో కూడా ఉన్నాయి. దీన్ని కొందరు అభివృద్ధి కోసం ఉపయోగిస్తే, మరికొందరు మాత్రం చెడు పనులకి ఉపయోగిస్తున్నారు.ఈ టెక్నాలజీ వాడుకొని కొందరు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి విషయాల నుండి పుట్టిందే ఈ జాగ్రత్తా ట్యూన్. అందువల్ల ప్రజలకు అవగాహనా కల్పించడానికి గవర్నమెంట్ ఈ ట్యూన్ ని అన్ని టెలికాం నెట్వర్క్ లలో ప్రవేశపెట్టింది. దీన్ని ఉద్దేశ్యం మంచిదే అయిన మనకు కొన్ని సందర్బాలలో చాలా చిరాకు తెప్పిస్తుంది.

ఈ ట్యూన్ ని ఎలా స్కిప్ చేయాలి? (2 Methods)
ట్రిక్ 1: 
  • మీరు ఎవరికైన కాల్ చేసేటప్పుడు, ఈ ట్యూన్ వచ్చే సమయం లో మీ మొబైల్ లో Dial Pad ఓపెన్ చేసి # ని క్లిక్ చేయండి. అంతే ఈ ట్యూన్ స్కిప్ అయ్యి వెంటనే కాల్ రింగ్ అవుతుంది.
ట్రిక్ 2: 
  • మీకు ఈ ట్యూన్ వచ్చిన వెంటనే  2 -3 టైమ్స్ కాల్ కట్ చేసి మళ్ళీ చేయడం వల్ల కూడా దీన్ని స్కిప్ చేయవచ్చు.

2. గూగుల్ పే Transaction హిస్టరీ ని డిలీట్ చేయడం ఎలా?

ప్రస్తుతం చాలా మంది డిజిటల్ లావాదేవీలకు Google Pay (GPay) ని ఉపయోగిస్తున్నారు. కానీ గూగుల్ పే లో చేసే ప్రతి పేమెంట్‌కి సంబంధించిన హిస్టరీ గూగుల్ అకౌంట్ లో సేవ్ అవుతుంది. కొంతమంది ప్రైవసీ కారణాల వల్ల లేదా పాత హిస్టరీను తొలగించాలనిపించినప్పుడు, ఈ ట్రాన్సాక్షన్ డేటా ని ఎలా డిలీట్ చేయాలి? అనే ప్రశ్న వస్తుంది. గూగుల్ పే లో నుండి ఈ హిస్టరీ ని డైరెక్ట్ గా డిలీట్ చేసే ఆప్షన్ లేదు. కాని ఈ ఆర్టికల్ ద్వారా మీరు గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని డిలీట్ చేసే 100%  Work అయ్యే official పద్ధతిని తెలుసుకుంటారు.  ( Warning: ఇది కేవలం మీ మొబైల్ లేదా పర్మిషన్ ఉన్న మొబైల్ లో మాత్రమే చెయ్యాలి. without permission illegal.)

స్టెప్స్:

  • ముందుగా మీ మొబైల్ లో గూగుల్ పే App ఓపెన్ చేసి, పైన right side లో ఉన్న మీ ప్రొఫైల్ ఐకాన్ ఫై క్లిక్ చేయండి.

Google Pay History Delete

  • Setting → Privacy & Security → Data and Personalisation ఫై క్లిక్ చేయండి.

Google Pay History Delete Google Pay History Delete Google Pay History Delete

 

  • ఇక్కడ కనిపిస్తున్న google account ఫై క్లిక్ చేయండి.

Google Pay History Delete

  • మీ గూగ్లర్ పే హిస్టరీ ఓపెన్ అవుతుంది. (Note: పైన right side లో మీ ప్రొఫైల్ చెక్ చేసుకోండి  / మీరు గూగుల్ పే కి ఇచ్చిన జీ-మెయిల్ ఉందా? లేకపోతే  ప్రొఫైల్ ఫై క్లిక్ చేసి same మెయిల్ యహో ఓపెన్ చేయండి).

  • ఇప్పుడు మీకు మీ మొత్తం Gpay హిస్టరీ కనిపిస్తుంది. మీరు డిలీట్ చేయాలనుకున్న హిస్టరీ పక్కన ఉన్న (x) ఐకాన్ క్లిక్ చేయండి. లేదా date wise గా / అన్ని హిస్టరీ లను డిలీట్ చేయాలనుకుంటే delete ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గూగుల్ పే ఓపెన్ చేసి చూస్తే అక్కడ హిస్టరీ కనిపించదు.

Conclusion:

గూగుల్ పే ద్వారా చేసే ప్రతి లావాదేవీ గూగుల్ అకౌంట్ లో స్టోర్ అవుతుంది. కానీ మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే లేదా unnecessary history ని తొలగించాలంటే, పై చెప్పిన విధంగా Google Activity పేజీ ద్వారా ట్రాన్సాక్షన్ హిస్టరీ ని సులభంగా డిలీట్ చేయవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే, షేర్ చేయండి! 4 Super Useful Tips for Everyday Life

3. మొబైల్ నుండి ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి?

ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనకు ప్రతి పనికి ఈ కార్డు అనేది ఏదో ఒక సందర్బంలో చాలా అవసరం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ భూమి ఫై బ్రతికున్న ప్రతి మనిషికి ఈ ఆధార్ కార్డు అనేది ఒక ప్రాపర్ అడ్రస్ లాంటిది. మరి అంత విలువైన ఈ కార్డు ని ఎక్కడో పోగొట్టుకోవడం కాని, పాడవడం కాని జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఈ కార్డు కోసం మళ్ళీ ఇంటర్నెట్ సెంటర్ లకు వెళ్లి, అక్కడ క్యూ నిలబడి ఉండి తెచ్చుకోవడం అనేది కొంచెం కష్టమైన పని. చాలా మందికి మన దగ్గర ఉన్న మొబైల్ లోనే ఈజీగా ఆధార్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అని తెలియదు. అలాంటి వారి కోసం ఈ ఆర్టికల్ లో ఇప్పుడు మనం UIDAI అధికారిక వెబ్‌సైట్ నుండి ఆధార్ PDF డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని  క్లియర్ గా  తెలుసుకుందాం. (Note: ఈ ప్రాసెస్ చేయాడానికి మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ valid గా ఉండాలి.)

AAdhar

  • మీ 12-అంకెల ఆధార్ నెంబర్ లేదా VID (Virtual ID) ఎంటర్ చేయాలి.
  •  Captcha code ఎంటర్ చేసి “Send OTP” ని నొక్కండి.
  • మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేయండి.
  • “Verify and Download” పై క్లిక్ చేయండి.

aadhar.

Top 6 Secret Social Media Tricks – Instagram, Facebook, WhatsApp, Twitter
  • ఇప్పుడు మీకు ఒక PDF ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది ఓపెన్ చేయాలంటే password అవసరం ఉంటుంది.

 

 🔐 Aadhaar PDF Password ఏమిటి?

మీరు డౌన్లోడ్ చేసిన ఆధార్ PDF ఓపెన్ చేయాలంటే ఈ పాస్వర్డ్ ఇలా టైపు చేయాలి:

Password Format:
👉 First 4 Letters of Your Name (Capital) + Year of Birth
Example: Name: Deepak Nagilla, Year of Birth: 2020

how to download aadhaar
Password = DEEP2020  ఇలా ఎంటర్ చేయగానే మీ Original ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.  (మీ ఆధార్ లో మీ పేరు / మీ ఇంటి పేరు ఏది ముందు ఉంటే అవే 4 లెటర్స్ ఇవ్వాలి.)

How to download aadhaar

4. మొబైల్ నుండి మీ vehicle యొక్క రోడ్ టాక్స్ ఎలా పే చేయాలి? (TS & AP)

Telangana Road Tax:

మీరు మీ vehicle యొక్క రోడ్ టాక్స్ పే చేయాడానికి మీ సేవ / ఇంటర్నెట్ షాప్ కి వెళ్ళుతున్నారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా మీ మొబైల్ లోనే టాక్స్ పే చేయవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం.!

  • ఈ లింక్ ఫై క్లిక్ చేయండి. Click here

How to pay road tax

  • మీకు ఇలాంటి పేజి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వెహికల్ Registration Number మరియు Chassis Number యొక్క last 5 Digits ఇవ్వండి.     (ఇవి మీ RC లో ఉంటాయి)
  • pay tax లో 3 / 6 / 1 year ని సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి Get Details ఫై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ వెహికల్ details కనిపిస్తాయి.
  • తర్వాత పేమెంట్ ఆప్షన్ లో బ్యాంకు / UPI ID సెలెక్ట్ చేసుకొని గూగుల్ పే / ఫోన్ పే / paytm తో మీ టాక్స్ ని పే చేయండి. mee receipt ప్రింట్ లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి.

How to pay road tax

Andhra Pradesh Road Tax:

AP & India లో అన్ని States వారు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ state ని select చేసి tax పే చేయవచ్చు.

  • వెబ్ సైట్ లింక్: Click here

Conclusion:

4 Super Useful Tips for Everyday Life లో మీకు ఉపయోగపడుతాయి.

ఇలా మీరు మీ ఆధార్ కార్డుని సులభంగా మొబైల్ లో నుండే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అవసరమైనప్పుడు వెంటనే ఉపయోగపడుతుంది. ఈ టిప్ ను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి – వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఇలాంటి మరెన్నో టిప్స్ తెలుసుకునేందుకు వెంటనే మా NR Telugu Tech page ని బుక్ మార్క్ చేసుకోండి.

10 Secret WhatsApp Pro Tips in Telugu 2025 – వాట్సాప్ లో టాప్ 10 సీక్రెట్ ఫీచర్స్

FAQs:

 1. ఆధార్ డౌన్లోడ్ చేసేందుకు మొబైల్ నెంబర్ తప్పనిసరా?

✔️ అవును, ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ అవసరం ఉంటుంది OTP కోసం.

 2. ఆధార్ PDF ఫైల్ సురక్షితమా?

✔️ అవును, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ PDF ఫైల్ కాబట్టి సురక్షితమే.

3. ఆధార్ డౌన్లోడ్ కి DigiLocker మంచిదా?

✔️ చాల మంచిది. అది కూడా ప్రభుత్వం చెలామణీ చేసే డిజిటల్ ఆధార్ వెర్షన్.

 4. Google Pay App లో history ని డిలీట్ చేయగలమా?
❌ కాదు, GPay App లో history delete చేసేందుకు option ఉండదు. Google Activity ద్వారా మాత్రమే చేయాలి.

 5. Deleted transaction history తిరిగి తీసుకోవచ్చా?
 కాదు, ఒకసారి delete చేసిన activity మళ్లీ తిరిగి పొందడం సాధ్యపడదు.

 6. Google Pay transaction list కొంతకాలానికి auto-delete అవుతుందా?
 కాదు, మీరు మీ చేతితో delete చేయాలి లేదా auto-delete settings enable చేయాలి.

7. Google Pay Activity ని permanently delete చేయవచ్చా?
✔️ అవును, Google Activity → All Time → Google Pay → Delete ద్వారా పూర్తిగా తొలగించవచ్చు.

 

Leave a Comment

NR Telugu Tech

Typically replies within a day